![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -642 లో... బారసాల ఫంక్షన్ లో అందరు సంతోషంగా ఉంటారు. అప్పుడే అనామిక ఎంట్రీ ఇస్తుంది. రాజ్, కావ్యలు ఇంట్లో ఎవరికి తెలియకుండా వందకోట్లు అప్పు చేశారని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ అప్పు తీర్చడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టారని చెప్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అనామిక ఇంట్లో వాళ్లకి ఇస్తుంది. ఇంత అప్పు చేసి ఆ డబ్బేం చేసారని ధాన్యలక్ష్మి అడుగుతుంది.
అంత మెల్లగా అడుగుతావేంటని ధాన్యలక్ష్మిని రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. ఇంట్లో గొడవ రాజేశానంటూ అనామిక వెళ్ళిపోతుంది. కావ్య ఏదో చెప్పబోతుంటే రాజ్ ఆపి ఈ విషయం లో కావ్య ఏం చేసిన నాకూ తెలిసే చేసింది.. అప్పు మాట నిజమే కానీ మేం అప్పు తీరుస్తాం. ఇప్పటికే ఇరవై అయిదు కోట్లు తీర్చామని రాజ్ చెప్తాడు. మేం ఇప్పుడేం జరిగిందని చెప్పే సిచువేషన్ లో లేము.. వినే సిచువేషన్ లో మీరు లేరని రాజ్ చెప్పి కావ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుందో అంత తెలుసుకుంటానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ , కావ్య లు ఎందుకు అప్పు చేశారుని అపర్ణ, సుభాష్ లు ఆలోచిస్తుంటారు.
అసలు అనామికకి దీని గురించి ఎలా తెలుసని రాజ్ తో కావ్య అంటుంది. ఇంకా నయం తాతయ్య గురించి నిజం బయటపడలేదు. ఈ లోపు మిగతా అప్పు కూడా తీర్చేయ్యాలని రాజ్ అంటాడు. అనామిక తను చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అవుతూ సామంత్ కి చెప్తుంది. రేపు బ్యాంకు నుండి ఆఫీసర్స్ వెళ్లి ఇంటిని జప్తు చేస్తారు. అప్పుడు ఆఫీస్ ని తక్కువ రేట్ కి మనం తీసుకుంటామని అనామిక ప్లాన్ చేస్తుంది. ప్రకాశ్, కళ్యాణ్ లకి ఆస్తుల గురించి మాట్లాడాలంటూ ధాన్యలక్ష్మి చెప్తుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతుంది.. ఆస్తులు వాటా అంటున్నారు అంటూ ధాన్యలక్ష్మి పై కళ్యాణ్ అరుస్తాడు. తరువాయి భాగంలో బ్యాంకు వాళ్ళు వస్తారు. టైమ్ కి అప్పు కట్టలేదు కాబట్టి ఇంటిని జప్తు చేస్తామని అంటారు. సుభాష్ వచ్చి నందగోపాల్ మోసం చేసిన విషయం చెప్తాడు. మాకు రావల్సిన ఆస్తులు మాకు ఇవ్వండి అని ధాన్యలక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |